యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) కీలక ఆదేశాలు జారీ చేసింది. తమను విశ్వ విద్యాలయంగా చూడవద్దు అని తమ ప్రకటనలు, వెబ్‌సైట్, వెబ్‌సైట్ చిరునామాలు, ఇ-మెయిల్ చిరునామాలు, లెటర్‌హెడ్‌లు, కమ్యూనికేషన్లు, హోర్డింగ్‌లు మొదలైన వాటిలో “విశ్వవిద్యాలయం” అనే పదాన్ని ఉపయోగించవద్దని కమిషన్ కోరింది. వీటిని ఉల్లంఘిస్తే గనుక కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పింది. 

 

ఇన్స్టిట్యూషన్ అనే పదాన్ని వాడాలని సూచించింది. ఇలా వాడుతున్న 127 ఉన్నత విద్యా సంస్థల జాబితాను కూడా కమిషన్ విడుదల చేసింది. ఒక కేంద్ర సంస్థ, ప్రావిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ చేత స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన విశ్వవిద్యాలయం మినహా ఏ సంస్థ అయినా," యూనివర్శిటీ "అనే పదాన్ని వాడటానికి వీలు లేదని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: