అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 17 లక్షల కేసులు లక్ష మరణాలు ఇలా చెప్పుకుంటూ అమెరికాలో కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. ఈ నేపధ్యంలోనే అమెరికాలో మరణించిన వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

 

దాదాపు 105 మంది తమ  కుటుంబ సభ్యులతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఒక భార్య తన భర్త గురించి... నా భర్త నుంచి నేను చాలా కోల్పోయాను. మాది 41 ఏళ్ళ దాంపత్య జీవితం. అతను నాకు చాలా ఇచ్చాడు. కాని నన్ను విడిచి ఒంటరిగా వెళ్ళిపోయాడు. అతనికి సంబంధించిన అన్నింటిని నాకు దూరం చేసాడు. కాని అతన్ని ఎప్పటికి మోస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: