పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి. తాము ఏదో అభివృద్ధి చేస్తున్నాం అని పాలకులు చెప్తున్నా సరే అక్కడ తాగునీటికి మాత్రం ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి సమస్య  ఒక రేంజ్ లో ఉంటుంది. వేలాది మంది రోడ్ల మీద నడిచి వెళ్లి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి. 

 

తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. జబువాలోని ఝాన్సర్ గ్రామంలో డ్రమ్స్ లో నీళ్ళు నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ నీటిని దొంగలించకుండా ఉండటానికి గానూ వాటికి తాళాలు వేసుకున్నారు. మొత్తం పంచాయతీ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, అందువల్ల కొన్నిసార్లు నీరు దొంగిలించబడుతుంది. కాబట్టి మేము దానిని తాళం వేసి ఉంచుతాము. మేము 3 కిలోమీటర్ల దూరం నుండి నీటిని తీసుకువస్తామని అక్కడి ప్రజలు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: