విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భాగా ట్విట్టర్ వేదికగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు. 

 

తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు నేల  గుండెల్లో  ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం, వారితో కలిసి నటించడం నా అదృష్టం, పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ... అంటూ చేసారు. 

 

అలాగే దర్శకుడు మెహర్ రమేష్ కూడా ట్వీట్ చేసారు. విశ్వ విఖ్యాత నట రత్న నందమూరి తారక రామారావు గారి జయంతి అని పేర్కొన్నారు. అలాగే అనీల్ రావిపూడి కూడా ఒక ట్వీట్ చేసారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ  శ్రీ నందమూరి తారక రామారావు గారి  జయంతి నేడు... 
N........ నటన 
T.......... తెగింపు 
R...........రాజసం అని పేర్కొన్నారు.

 

నిర్మాత బండ్ల గణేష్ కూడా ట్వీట్ చేసారు. తెలుగుజాతి పౌరుషం తెలుగుజాతి రాజసం తెలుగుజాతి కీర్తి తెలుగు జాతి వీరత్వం తెలుగు జాతి సంపద నందమూరి తారక రామారావు గారకి వందనం అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: