ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీలం సహాని హైకోర్ట్ కి హాజరు అయ్యారు.  ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం పై ఆమె వివరణ ఇవ్వడానికి గానూ హైకోర్ట్ కి వచ్చారు. ఆమె తో పాటుగా పంచాయితి రాజ్ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది కూడా హాజరు అయ్యారు. కోర్ట్ దిక్కరణ కింద ఎందుకు దీనిని తీసుకోవద్దు అని హైకోర్ట్ వేసిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పడానికి వెళ్ళారు. 

 

ఇటీవల విచారణ సందర్భంగా ఆమె కోర్ట్ కి రావాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కాగా వైసీపీ రంగులు తొలగించి వేరే రంగు వెయ్యాలని హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా సరే వైసీపీ సర్కార్ మాత్రం ఆ రంగులు అదే విధంగా ఉంచి మరో రంగు వేయడాన్ని హైకోర్ట్ కోర్ట్ దిక్కరణ అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: