ఇప్పుడు తెలంగాణాను మిడతల దండు బాగా ఇబ్బంది పెడుతుంది. మహారాష్ట్ర నుంచి మిడతల దండు తెలంగాణా వైపు దూసుకు రావడం ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్ర లోని నాగపూర్ వద్ద ఈ మిడతల దండు ఉందని అధికారులు చెప్తున్నారు. ఇవి గంటకు గాలి ఎంత వేగంతో వీస్తే అదే వేగంతో వచ్చేస్తు ఉంటాయని కాబట్టి అధికారులు అప్రమత్తం కావాలని సూచనలు చేస్తున్నారు. 

 

తెలంగాణాకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఇవి ఉన్నాయని అధికారులు చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇవి ఆదిలాబాద్ ,నిర్మల్ ,ఆసిఫాబాద్, మంచిర్యాలతోపాటు నిజామాబాద్ జిల్లాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి అధికారులు వెంటనే అప్రమత్తం కావాలని ప్రభుత్వం కూడా సూచనలు చేసింది. ఇక మహారాష్ట్ర సహా రెండు రాష్ట్రాల్లో వాటిపై డ్రోన్లను ప్రయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: