ప్రపంచంలో కరోనా మహమ్మారి  ఏ విధంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.  ప్రతిరోజూ దీని ప్రభావం మరింత పెరిగిపోతుంది.. అయితే లాక్ డౌన్ చేసినప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం వైఖరి వల్ల ప్రతిరోజూ కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు.  అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కాస్త తక్కువే ఉన్నా.. మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కొత్తగా కరోనా సోకగా, 194 మంది మరణించారు.       

 


ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,58,333కి చేరగా, మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67692 మంది కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ మరికొంత కాలం పెంచే యోచనలు కేంద్ర ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: