భారత దేశంలో ఇప్పుడు కరోనా తోనే కష్టాలు పడుతుంటే ఇది చాలదన్నట్టు మిడతల గోల మొదలైంది.  పాకిస్థాన్ నుంచి గంటకు 15 కి.మీ. వేగంతో మిడతల దండు కదలి వచ్చింది. ఒక్కసారి వాటి భారిన పడితే పంట పొలం నామరూపాల్లేకుండా పోతుందని.. చాలా ఏళ్ళుగా వింటున్నాం. గతంలో రాజస్తాన్‌, గుజరాత్‌, పంజాబ్, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాల్లో ఈ మిడతల దండు ప్రవేశించినట్లు తెలుస్తున్నా.. 1974 అనంతరం వీటి దాడి గురించి పెద్దగా ఎక్కడా వినిపించలేదు.  ఇక దేశంలో రైతు ఆరుగాలం శ్రమించి, రాత్రి.. పగలు తేడాలేకుండా పండించిన పంటకు వంద చిక్కులు అడ్డంకిగా మారుతున్నాయి. భూమిలో విత్తనం వేసిన దగ్గర నుండి ఇప్పుడు ఏదైనా ఖర్చుతో కూడుకున్న పనే. రైతు చుట్టూనే కోట్ల వ్యాపారం జరుగుతున్నా ఆ రైతుకు మాత్రం పండిన పంట అమ్ముకొనే వరకు ఋణం ఎంతో ఆ దేవుడికి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో.

 

మహారాష్ట్రతో సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ, అక్కడ నుండి ఆంధ్రా భూభాగంలోకి కూడా ఈ ఏడాది ప్రవేశించే అవకాశం ఉందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. మిడతల దాడి మొదలైన ప్రాంతాల్లో కొందరు డీజే సౌండు పెట్టి వాటిని బెదరగొట్టి వెనక్కి పంపించేశారు. పన్నాలో జిల్లా పరిపాలన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సైరెన్‌లు మోగించి మిడతలను తరిమికొట్టారు. భారీ శబ్దాలకు ఆ మిడతలు తోక ముడుస్తున్నాయి. సైరెన్ మోగించిన వీడియోను యూపీలోని ఝాన్సీ పోలీస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ ట్వీట్ చేశారు. మిడతలను తరిమేందుకు డీజే స్పీకర్లే కాకుండా చప్పట్లు, పెద్ద శబ్దాలు కూడా చేయొచ్చన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: