ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం పరిశ్రమల కోసం డబ్బులు అడగదని... లంచాలు తీసుకోని ప్రభుత్వం అని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని... బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని అన్నారు. 
 
పరిశ్రమలకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... నీరు ఇచ్చేందుకు బలమైన వ్యవస్థ సిద్ధంగా ఉందని... రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. ఏపీలో మంచి ప్రభుత్వం ఉందని మేమెందుకు వెనక్కు వెళతామని కియా చెప్పిందని... కియా వెళ్లిపోతుందంటూ కొందరు అసత్య వార్తలు సృష్టించారని అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: