దేశంలో ఫిబ్రవరి మాసం నుంచి మొదలైన కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతూ వచ్చాయి. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. అప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తికట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.  షాపింగ్ మాల్స్,థియేటర్లు, విద్యా సంస్థలు జనసమూహం ఉన్న అన్నీ బంద్ చేశారు.  ఈ మద్య లాక్ డౌన్ కొద్ది మేరకు సడలించారు. తాజాగా భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కొత్తగా కరోనా సోకగా, 194 మంది మరణించారు.   

 

ఇక ఏపిలో గత 24 గంటల్లో 9,858 శాంపిళ్లను పరీక్షించగా మరో 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,841అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 824 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,958 మంది డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో కరోనాతో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: