ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతో మన పాలన మీ సూచనలో భాగంగా సదస్సు నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో సూక్ష్మ, మధ్య పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను ఇవ్వలేదని... చంద్రబాబు రాష్ట్రంలో రాయితీలను కూడా అమ్ముకున్నారని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. 
 
సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రస్తుతం 968 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2400 కోట్ల రూపాయల్తో 8 ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమలను కాపాడుకుంటే మాత్రమే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని సీఎం జగన్ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 1200 కోట్ల రూపాయలతో ప్యాకేజీలు ఇచ్చామని సీఎం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: