పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి  సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తాజాగా మన  పాలన మీ సూచన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలను వెల్లడించారు. 

 

 ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక  ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 34 వేల మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పించాము  అంటూ చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వాలు ప్రత్యేక హోదా తీసుకు వస్తామని చెప్పి మాట తప్పాయి అంటూ చెప్పుకొచ్చారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ప్రత్యేక హోదా వచ్చి ఉంటే కంపెనీలకు రాయితీ దొరికేది అంటూ వ్యాఖ్యానించారు. సరికొత్త కంపెనీలను తీసుకొచ్చి మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: