ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారి సలహాలు, సూచనలను స్వీకరించారు. సీఎం జగన్ రాష్ట్రంలో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని మచిలీపట్నం, రామయ్య పట్నం, శ్రీకాకుళంలోని భావనపాడులో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ఏర్పాటు అవుతాయని అన్నారు. రాష్ట్రంలో 2400 కోట రూపాయలతో 8 ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. 
 
హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలతో పోటీ పడే సత్తా రాష్ట్రంలో విశాఖకు మాత్రమే ఉందని సీఎం తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన చేసుకోవడం దురదృష్టకరమని... ఘటనపై వేగంగా స్పందించామని అన్నారు. రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని సీఎం జగన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: