ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన పాలన మీ సూచన నాలుగో రోజు సదస్సులో భాగంగా పారిశ్రామికవేత్తలతో చర్చించారు. రాష్ట్రంలోని విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ యూనివర్సిటీని దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ వర్సిటీగా ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో విశాఖ మాత్రమే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలతో పోటీ పడుతుందని తెలిపారు. 
 
రాష్ట్రంలో పరిశ్రమల కోసం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని సీఎం జగన్ అన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, నీటి కేటాయింపుల విషాయంలో ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 1466 పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని సీఎం తెలిపారు. కడపలో 15,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని... ప్రైవేట్ కంపెనీలతో స్టీల్ ప్లాంట్ పరిశ్రమ విషయంలో కలిసి పని చేయడానికి సిద్ధమని సీఎం ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: