తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో పాలను ఉడికిస్తే ప్లాస్టిక్‌ పదార్థంలా మారింది. స్థానిక రాజారాం దుబ్బలో నివాసం ఉండే అస్లామ్ ఒక పాలకేంద్రం నుంచి లీటర్ పాలు కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి వేడి చేయగా పాలు పగిలిపోయాయి. పగిలిపోయిన పాలను వేడి చేసి అందులో చక్కెర కలుపుకొని తిందామనే ఆలోచనతో పాలను మరిగించాడు. అయితే పాలు ప్లాస్టిక్ ముద్దగా మారడంతో షాక్ అవ్వడం అస్లామ్ వంతయింది. 
 
పాల నుంచి ప్లాస్టిక్ వాసన రావడంతో అస్లామ్ డీఎస్పీ దామోదర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. అనంతరం అదే పాలకేంద్రం నుంచి మరో పాలప్యాకెట్ ను కొని వేడి చేయగా ఆ పాలు కూడా ప్లాస్టిక్ ముద్దలా తయరయ్యాయి. పాలలో రసాయనాలను కలిపి విక్రయించడం వల్లే పాలు ప్లాస్టిక్ గా మారినట్టు తెలుస్తోంది. లీటర్‌కు రూ. 60 చొప్పున విక్రయిస్తున్న పాలలో రసాయనాలు కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టణంలో ప్లాస్టిక్ పాలు వెలుగు చూడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: