ట్రూకాలర్‌ యాప్‌‌ వాడుతున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఓ డార్క్ వెబ్ సైట్ లో కాలర్‌‌ ఐడెంటిటీ యాప్‌‌లోని వినియోగదారుల డేటా ను ట్రూకాలర్ అమ్మకానికి పెట్టినట్టు ఓ సైబర్‌‌ సెక్యూరిటీ నిపుణుడు వెల్లడించారు. దాదాపుగా ఈ డార్క్ వెబ్ సైట్ లో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది యూజర్లున్న ఈ యాప్‌‌ డేటాను కేవలం 1.5 లక్షల నుండి 20 లక్షల వరకు డాటాను అమ్మకానికి పెట్టారని అయన తెలియజేసారు. ఇందులో దాదాపుగా 4.75 కోట్ల భారతీయ వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్యా 60 నుండి 70 శాతం గా ఉన్నట్లు తెలియజేసారు. ఈ వార్త బయటికి రావడం తో యూజర్లు కంగారు పడుతున్నారు.

 

 

ఇదిలా ఉండగా ట్రూ కాలర్ మాత్రం మేము యూసర్స్  డాటా ఎటువంటి డార్క్ వెబ్ సైట్ లోను పెట్టలేదని చెప్పింది.  ‘మా సర్వర్లలో స్టోర్‌‌ చేసిన డేటా చాలా సేఫ్‌‌గా ఉంటుంది. యూజర్ల ప్రైవసీ మా బాధ్యత. ఇలా డేటా మిస్‌‌యూజ్‌‌ జరగకుండా చర్యలు తీసుకుంటూనే ఉంటాం’ అని చెప్పింది. వినియోగ దారుల సెన్సిటివ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ ఎప్పటికి బయటికి రాదని చెబుతోంది, ముఖ్యంగా పేమెంట్ వివరాలు. అయితే డార్క్ వెబ్ లో ఉన్న డేటా అంతకుడా 2019 సంవత్సరం న రిలీజ్ ఐన డేటా కావచ్చని అభిప్రాయపడింది. ఐతే ఈ సందర్భంగా యూసర్ సెర్చ్ డేటాపై మరింత ఫోకస్ పెడుతున్నట్లు చెప్పింది. అదేవిధంగా రోజువారీ లిమిట్ నికూడా పెడుతున్నట్లు తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: