ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి తనను పిలవలేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపణలు చేసారు.  చిరంజీవి  ఇంట్లో జరిగిన సమావేశానికి తనను పిలవలేదని వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని అది సినీ పరిశ్రమ మీటింగ్ కాదని బాలయ్య అన్నారు.  హైదరాబాద్ లో కూర్చుని భూములను పంచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 

 

దీనితో  ఒక్కసారిగా దుమారం రేగింది. ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఆయన నిర్మాత కాదు కాబట్టి పిలవలేదు అని సి కళ్యాణ్ అనే  నిర్మాత ఒకరు వ్యాఖ్యానించారు. అవసరం అనుకున్నప్పుడు బాలకృష్ణను చర్చలకు పిలుస్తామని ఆయన చెప్పారు. బాలకృష్ణ ఒక మంత్రిని ఉద్దేశించి అన్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: