ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ఎక్కడో చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన ఈ మాయదారి కరోనా మహమ్మారి రోజు రోజుకీ దీని ప్రతాపం చూపిస్తుంది.  అయితే ఇప్పుడు ఈ కరోనాపై అవగాహ కల్పించడానికి ఇప్పటికే పలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనా పై ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు.  తాజాగా ‘అ!’ , ‘కల్కి’ చిత్రాలతో విమర్శకుల మెప్పు పొందిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ‘కరోనా’ పై ఓ చిత్రం తీయడానికి రెడీ అవుతున్నాడు.  ఈ మేరకు ఆయన గురువారం ఒక ట్వీట్ చేశారు.  

 

సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది. దీని ప్రభావం దేశాలపై,  ప్రజలపై ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తుంది, వ్యాక్సిన్ వ‌స్తే ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా చర్చించనున్నాడట. ఈ మూవీ టైటిల్ ఏంటి? కరోనా వ్యాక్సినే టైటిలా? ఇతర వివరాలు రేపు తెలియనున్నాయి. ఈ చిత్రం స‌రికొత్త‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించేలా ఉంటుంద‌ని తెలుస్తుంది. తన తొలి రెండు చిత్రాల్లోనూ వినూత్నమైన కాన్సెప్ట్‌లు ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. ఈ మూడో చిత్రంలో కూడా ఏదో కొత్తదనం చూపించబోతున్నారని అర్థమవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: