వలస కార్మికులను సొంత ఊర్లకు చేర్చడానికి గానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని సుప్రీం కోర్ట్ సూచనలు చేసింది. రైళ్లు, బస్సుల్లో వలస కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేయవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది వలస కూలీల సమస్యలను సమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వలస కార్మికుల ప్రయాణ చార్జీల భారాన్ని రాష్ట్రాలు భరించాలని చెప్పింది. 

 

కార్మికులందరికీ ఉచితంగా ఆహారం సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆహారం ఎక్కడ అందుబాటులో ఉందనే వివరాలను బహిరంగంగా వెల్లడించాలని సూచనలు చేసింది. వలస కూలీలు ప్రయాణం ప్రారంభించే ప్రాంతంలో ఆయా రాష్ట్రాలు వారికి ఆహారం, నీరు అందచేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రాలే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: