భారత దేశంలో జాతీయ పక్షిగా నెమలికి ఎంతో గౌరవం ఇస్తాం.  నెమలిని చంపడం పెద్ద కేసు కింద పరిగణిస్తారు.  కానీ వేటగాళ్ళు మాత్రం యేదేచ్ఛగా నెమళ్లను వేటాడుతుంటారు.  తాజాగా తమిళనాడు పుడుకొైట్టె జిల్లాలోని అరైమలం గ్రామంలో 13 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన వరి పంట పొలాన్ని ఎలుకలు, ఇతర కీటకాలు, జంతువుల నుంచి కాపాడుకునేందుకు.. పొలం చుట్టూ విష గుళికలు చల్లాడు. ఈ విష గుళికలను తిన్న 13 నెమళ్లు చనిపోయాయి.  ఒక్కసారే అన్ని నెమళ్ళు చనిపోవడంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. ఆ పొలం వద్దకు చేరుకుని నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు.

 

అయితే నెమళ్లను నేరుగా వేటాడకున్నా వాటి చావుకు కారణం మాత్రం కాశీనాథన్ అయ్యారు. మరి ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. నెమళ్ల మృతికి కారణమైన రైతు కాశీనాథన్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రైతుపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అతన్ని జైలుకు తరలించారు. నెమళ్ల కళేబరాల శాంపిల్స్‌ను తిరుచ్చిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: