తెలంగాణా వైపు మిడతల దండు వచ్చే అవకాశాలు ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణా సిఎం కేసీఆర్ దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక ఇది పక్కన పెడితే గాలి వాటం ప్రకారం మిడతల దండు ప్రయాణం ఉంటుంది అని పేర్కొన్నారు నిపుణులు. 

 

గాలి వాటం దక్షిణం వైపు ఉంటే కచ్చితంగా అవి తెలంగాణా వైపే వస్తాయి. దీనితో తెలంగాణా, చత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తం అయ్యారు. అయితే గాలి ఇటు వీచే పరిస్థితి ప్రస్తుతం లేదని సరిహద్దు ఉండటమే సమస్య గాని గాలి ఇటు వైపు వచ్చే సూచనలు దాదాపుగా లేవు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: