దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది. లాక్ డౌన్ ఉన్నా సరే దీనిలో ఏ విధమైన మార్పులు ఇప్పుడు రావడం లేదు. రోజు రోజుకి తీవ్రత పెరగడమే గాని తగ్గే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు. ఈ నేపధ్యంలోనే దేశానికి విదేశాల నుంచి వైద్యులను తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని వార్తలు వస్తున్నాయి. క్యూబా సహా అకొన్ని దేశాల నుంచి ఇప్పుడు వైద్యులను తీసుకు రావాలని భావిస్తున్నారు. 

 

క్యూబా లో భారీగా వైద్యులు ఉన్నారు. అక్కడ కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో అక్కడి వైద్యులను వాడుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఆ దేశ అధ్యక్షుడి తో కూడా మోడీ మాట్లాడినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: