ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా ఇప్పుడు మన దేశంలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,58,333కి చేరగా, మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67692 మంది కోలుకున్నారు. అయితే కరోనా మొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో దీని ఉధ్రితి మరీ ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మారణహోమం సృష్టిస్తోంది.

 

రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 105 మందిని కరోనా బలితీసుకుంది. దేశవ్యాప్తంగా నిన్న సంభవించిన మరణాల్లో ఇది 54 శాతం కావడం గమనార్హం.  రాష్ట్రంలో గత 24 గంటల్లో 130 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడిన పోలీసుల సంఖ్య 2,095కి చేరుకుంది. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. రక్షణ కల్పిస్తున్న 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.   గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2,598 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 56,948కి పెరగ్గా, 1,897 మరణాలు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: