తబ్లీగ్ జమాత్ చీఫ్, నిజాముద్దీన్ మర్కజ్‌కు చెందిన మౌలానా సాద్‌ పై సిబిఐ దృష్టి పెట్టింది. ఆయనకు అందిన విరాళాలు అన్నీ కూడా హవాలా మార్గంలో విదేశాల నుంచి వచ్చినవే అని గుర్తించారు. కరోనా దేశ వ్యాప్తంగా వ్యాపించడానికి అతనే కారణం అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

ఇక అతనిపై ఇప్పటికే ఢిల్లీ నేర విభాగం పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇక అతనికి వచ్చిన నిధులపై కూడా ఇప్పుడు దర్యాప్తు పెద్ద ఎత్తున సాగుతుంది.  సీబీఐ అధికారులు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు, ఈడీ, ఐటీ విభాగాల నుంచి మౌలానాకు అందిన విదేశీ విరాళాలపై పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. విరాళాలపై కీలక డాక్యుమెంట్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: