భారత్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. మ‌న దేశంలో క‌రోనా ప్ర‌వేశించిన‌ప్పుడు చాలా మంది దీనిని లైట్ గా తీసుకున్నారు. ఆ త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ కాస్త ముందుగానే కోలుకుని ఏకంగా నాలుగుసార్లు లాక్ డౌన్ పొడిగించు కుంటూ వ‌చ్చారు. దీంతో కేసుల తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టినా ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయ‌డంతో పాటు ప్ర‌జ‌లు కూడా క‌రోనాతో క‌లిసి ముందుకు సాగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి అని డిసైడ్ అవ్వ‌డంతో దేశంలో క‌రోనా కేసులు తీవ్ర‌మ‌వుతున్నాయి.

 

ఇక తాజా లెక్క‌లు చూస్తే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు అయ్యాయి. క‌రోనాపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన లెక్కల‌ను బ‌ట్టి చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒకే రోజు ఏకంగా ఏడు వేల‌కు పైగా కేసులు అంటే పరిస్థితి రోజు రోజుకు ఎంత డేంజ‌ర్ లోకి వెళుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.

 

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతిచెందారు. ప్రస్తుతం 89,987 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో, గుజరాత్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: