దేశంలో ఇప్పుడు కరోనా గోలతో నానా తంటాలు పడుతుంటే.. ఇప్పుడు మిడతల గోల మొదలైంది.  అసలే అకలితో అలమటించి పోతున్న ఈ సమయంలో ఉన్న గింజలు కాస్త హరించేస్తున్నాయి మిడతలు. పాకిస్థాన్ నుంచి గుంపులుగా వచ్చిన మిడతలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నానా రచ్చ చేస్తున్నాయి.  హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది. కంగ్రా, ఉనా, బిలాస్‌పూర్‌, సోలన్‌ జిల్లాలోని పంట పొలాలపై మిడతల దండు దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించాయి.  మిడతల సంచారంపై క్షేత్రస్థాయిలోని సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. 

 

గాలి తీవ్రతను అనుసరించి మిడతలు గంటలకు 16 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మిడతలు ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో వాలినప్పుడు తక్షణం రసాయనాలను స్ప్రే చేయాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: