ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఏపీ సర్కార్ కి బిగ్ షాక్ తగిలింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా కొనసాగించాలి అని ఏపీ హైకోర్ట్ తాజాగా ఇచ్చిన తీర్పులో స్పష్టంగా చెప్పింది. రమేష్ కుమార్ ని తొలగిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ ని కూడా ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. ఆయన పదవి కాలం మూడేళ్ళు ఉందని ఆయనను కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ -గ్రామీణాభివృద్ధి శాఖ,

 

గత నెల 10న జారీ చేసిన 617, 618, 619 జీవోలు చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో పాటు మొత్తం 13 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్ట్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ నెల 8వ తేదీన తీర్పును రిజర్వు చేసి ఇప్పుడు తీర్పు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: