ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆయనను తొలగిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ ని హైకోర్ట్ కొట్టేసింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

 

ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వ్యవహారంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తన తీర్పులో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ... ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్ట్... కాలపరిమితి తగ్గిస్తూ ఆయన విషయంలో ఇచ్చిన జీవోలు అన్నీ కూడా కొట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: