కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్‌ పంపు హౌజ్‌ ను సీఎం కేసీఆర్ .. చినజీయర్‌ స్వామితో కలిసి ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో రెండు మోటార్లను స్విచ్చాన్‌ చేసి.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభించారు.  ఉదయం వేకువ జామున 4:30 గంటలకు చండీయాగం ప్రారంభమైంది.   సీఎం కేసీఆర్ సతీ సమేతంగా అక్కడికి చేరుకుని అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.  పూర్ణాహుతి నిర్వహించి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయం 9.35 గంటలకు ఎర్రవల్లిలో రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉదయం 9.40 గంటలకు మర్కుక్‌లోని రైతు వేదికకు శంకుస్థాపన చేశారు.

 


ఉదయం 9.50 నిమిషాలకు సీఎం మర్కుక్‌ పంప్‌ హౌస్‌ చేరుకున్నారు. త్రిదండి చిన చినజీయర్‌ స్వామి వారి వద్దకు 10 గంటల సమయంలో సీఎం చేరుకున్నారు. త్రిదండి చినజీయర్‌ స్వామిని సీఎం కలిసి మర్కుక్‌ పంప్‌ హౌస్‌ వద్ద సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొంటారు. సుదర్శన హోమం, పూర్ణాహుతి ముగిసిన తర్వాత 11.30 గంటల సమయంలో పంప్‌ హౌస్‌ను సీఎం ప్రారంభించారు. 

 


కొండపోచమ్మ సాగర్ కట్ట దగ్గర డెలివరీ సిస్టర్న్ దగ్గరకు చేరుకున్నారు సీఎం. కాసేపట్లో  డెలివరీ సిస్టర్న్ దగ్గర గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం వరదరాజుపూర్ లోని రాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. 12.40 కి మర్కూక్ పంపుహౌజ్ వద్దకు చేరుకొని ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారుల సమావేశానికి హాజరుకానున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.


 

మరింత సమాచారం తెలుసుకోండి: