దేశంలో ఎప్పుడైతే కరోనా కేసులు మొదలయ్యాయో.. రాష్ట్రాల మద్య రవాణా సౌకర్యాల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఒకదశలో రెండు నెలలు రాష్ట్రాల మద్య రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పొచ్చు.  కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడ వారు అక్కడే చిక్కుకు పోయారు. ఇటీవల లాక్ డౌన్ సడలింపు చేసిన తర్వాత వలస కార్మికులు తమ స్వస్థలాలకుచేరుకుం టున్నారు. ఇక చిన్న చిన్న పనులు చేసుకునేవారు, చిరుద్యోగులు బయటకు వచ్చి తమ పనులు నిర్వహించుకుంటున్నారు. దాంతో ఇప్పుడు కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్న రూమర్లు మొదలయ్యాయి.

 

ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఢిల్లీ–గుర్గావ్‌ రోడ్‌ను క్లోజ్‌ చేసింది. దీంతో హర్యానాఢిల్లీ బోర్డర్‌‌లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సైకిళ్లపై పనులకు వెళ్లేవారు రోడ్డుపై బైఠాయించి బోర్డర్‌‌ను తెరవాలని డిమాండ్‌ చేశారు. తమను పనులకు వెళ్లనివ్వాలని పోలీసులను కోరారు. వాళ్లంతా రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగటంతో ఢిల్లీ–గుర్గావ్‌ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాగా, ఢిల్లీ బోర్డర్‌‌లోనే కేసులు అధికంగా ఉన్నాయని, అందుకే కేవలం నిత్యావసర సరకుల రవాణాకు మాత్రమే అనుమతిస్తున్నామని హర్యానా మినిస్టర్‌‌ అనిల్‌ విజ్‌ చెప్పారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: