నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ క్షణం నుంచి ఎన్నికల కమీషనర్ గా కొనసాగుతారని కనగరాజు నియామకం చెల్లదు అని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ ఏపీ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్ ని ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. దీనితో ఏపీ సర్కార్ కి షాక్ తగిలినట్లు అయింది. 

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ఏపీ సర్కార్ కి  లేదని పేర్కొంది. దీనిపై జంధ్యాల మాట్లాడుతూ ఇక నుంచి  రమేష్ కుమార్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అని అన్నారు. కనగరాజ్ కి కమీషనర్ గా ఉండే అధికారం లేదని పేర్కొన్నారు. ఇక దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: