ఏపీ సిఎం వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. క్యాన్సర్ ని కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. మరో రెండు వారాల్లో అందరికి కూడా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని సిఎం జగన్ అన్నారు. 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మందులు ఇస్తున్నామని చెప్పారు  జగన్. కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా సిఎం జగన్ అన్నారు. కార్పోరేట్ ఆస్పత్రుల మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉంటాయని అదే స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పారు ఆయన. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులతో పాటుగా ఐటిడిఏ పరిధిలో 7 సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: