ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఐదో విడత రేషన్ ప్రారంభమైంది. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తోంది. బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు చొప్పున రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలోని 28,354 రేషన్‌ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. వాలంటీర్లు టైం స్లాట్ కూపన్లను బియ్యం కార్డుదారులకు అందజేస్తున్నారు. 
 
కేంద్రం నిబంధనల ప్రకారం ప్రభుత్వం లబ్ధిదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి చేసింది.. అధికారులు పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులకు సరుకులు అందేలా ఏర్పాట్లు చేశారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లను అందుబాటులో ఉంచడంతో పాటు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: