కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన కొండపోచమ్మ సాగర్ ని నేడు తెలంగాణా సిఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేసీఆర్ ని పలువురు కీర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు తెలంగాణా మంత్రి కేటిఆర్ కూడా ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై ప్రసంశల వర్షం కురిపించారు. కేసీఆర్ అనే పదానికి అయన కొత్త అర్ధం చెప్పారు. K కాల్వలు C చెరువులు R రిజర్వాయర్లు పేరు సార్థకం కాగా.. 

 

అని ట్వీట్ చేసారు. మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు.. 82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: