గత రెండు నెలలుగా కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి మాసం నుంచి కరోనా వైరస్ దాని ప్రతాపం చూపించడం మొదలు పెట్టింది. దాంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నాం. దాంతో సినీ పరిశ్రమ మొత్తం షట్ డౌన్ అయ్యింది.  ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలు ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నారు. దాంతో సినిమా షూటింగ్స్ మొదలైతే సినీ కార్మికులకు పని దొరుకుతుందని... పద్నాలుగువేల మంది సినీ కార్మికులనుఆదుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ కి చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాగా, చిరంజీవి నివాసంలో ఈరోజు సీసీసీ మీటింగ్ జరిగింది. షూటింగులను ప్రారంభించడం, సినీ కార్మికులకు రెండో విడత సాయం వంటి అంశాలపై సినీ ప్రముఖులు ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం.. తమ్మారెడ్డి మాట్లాడుతూ, మరోసారి సమావేశమవుతామని చెప్పారు.

 

ఈ సందర్భంగా బాలకృష్ణ, నాగబాబు వివాదంపై మీడియా ప్రశ్నించగా... గత సమావేశానికి బాలకృష్ణను పిలవాలని అన్నారు. బాలకృష్ణ లేకుండా ఇండస్ట్రీ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.  ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ చేసేవారు లేరని నేను అనను..కానీ దానికి మీటింగ్ కి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.   ఈ సమావేశాలన్నీ కేవలం పరిశ్రమ కోసమేనని అన్నారు.  అవసరాన్ని బట్టి మీటింగ్ కు కొందరిని పిలిచారని తమ్మారెడ్డి చెప్పారు. ఇందులో కొంత మంది ముఖ్య సభ్యులను లీడ్ తీసుకోవాలని సూచనలు వచ్చాయి.. జరిగిన దాంట్లో ఎలాంటి వివాదం లేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: