ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సును రద్దు చేసింది. ఈ తీర్పుపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది.  తాజాగా దీనిపై స్పందింన అంబటి రాంబాబు మాట్లాడుతూ..  కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఒక్కోసారి న్యాయం జరగకపోవచ్చని అన్నారు. ఆ తీర్పు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న విషయం నిజమే అయినా, అంతమాత్రాన రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు.

 

ఆ మాటకు వస్తే గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ కి వ్యతిరేకంగా అనేకసార్లు కోర్టు తీర్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు.   కోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: