ఏపిలో గత కొన్ని రోజులుగా రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తప్పిదాలు ఎక్కడ దొరుకుతాయా అంటూ ప్రతిపక్ష పార్టీ.. లేని పోని విమర్శలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తూ అధికార పార్టీల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది.   ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సును రద్దు చేసింది. ఈ తీర్పుపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. కోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. 

 

 

తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డనే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పు హర్షణీయం అని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా అర్థమవుతోందని తెలిపారు. అందరికంటే, అన్నిటికంటే రాజ్యాంగమే గొప్పదని, వ్యక్తులు కాదని సీఎం రమేశ్ హితవు పలికారు. వ్యవస్థలు శాశ్వతంగా ఉండాలని, రాజ్యాంగానికి లోబడి పరిపాలన ఉండాలని, ఇదే మన రాజ్యాంగ స్ఫూర్తి అని  పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు అధికార పక్షంపై రక రకాల విమర్శలు చేస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: