తమిళనాడులో కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ వేల కేసులు వారం రోజుల్లో నమోదు అయ్యాయి. చెన్నై కోయమేబేడు మార్కెట్ ఘటన తర్వాత అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. వేల కేసులు నమోదు కావడం తో అక్కడి ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. లాక్ డౌన్ ఉన్నా సరే కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

 

ఇక గత 24 గంటల్లో అక్కడ కరోనా కేసులు 874 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 20,246 గా ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా కు వివరించింది. అయితే అక్కడ మరణాలు మాత్రం చాలా తక్కువగా ఉండగా రికవరీ రేటు వేగంగా పెరుగుతుంది. చెన్నై లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: