ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా... ఎంతోమంది జగన్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎలాంటి అనుభవం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చి నేరుగా  ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. అదే  ఒకవేళ  అనుభవం ఉంటే ఇంకా ఎంత బాగా జగన్మోహన్ రెడ్డి  పాలన సాగించేవారు  అని ప్రశంసలు కురిపిస్తున్నారు విశ్లేషకులు. ఒక్క జగన్ మాత్రమే కాదు ఇప్పటి వరకు ఎలాంటి అనుభవం లేకుండా డైరెక్టుగా ముఖ్యమంత్రి పదవి లోకి చేరిన వారిలో గొప్ప వ్యక్తిగా చేరిపోయారు ముఖ్యమంత్రి జగన్.

 


 ఇక పాలనలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం ఒక సంచలనం చారిత్రాత్మక నిర్ణయం గా మారిపోయింది. ఎలాంటి అనుభవం లేకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి సంచలనం సృష్టించిన వారిలో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత  జగన్  ఒక్కడికే సాధ్యం అయిందని అంటున్నారు విశ్లేషకులు.అప్పట్లో ఆ మహనీయులు  నేరుగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పాలనలో ఎలా చరిత్ర సృష్టించారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అలా చరిత్ర సృష్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: