ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలన సందర్భంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఏకకాలంలో పది వేల 641 రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులకు శిక్షణా తరగతులతో పాటుగా అవి విజ్ఞాన కేంద్రాలుగా పని చేయనున్నాయి. కాల్ సెంటర్ ద్వారా రైతులకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. 

 

ఈ కార్యక్రమంలో మంత్రి కన్న బాబు కూడా పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా సలహాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేంద్రాలను సిఎం జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి ప్రారంభించారు. కాల్ సెంటర్ నెంబర్ 155251. విత్తనాలు ఎరువులు పురుగుమందులకు  ప్రభుత్వమే గ్యారెంటి ఇవ్వనుంది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: