తొలి ఏడాది పాలన చిత్తశుద్ధితో నిజాయితితో గడిచిందని సిఎం వైఎస్ జగన్ అన్నారు. తాను 3600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశా అని ఈ పాద యాత్రలో తాను రైతుల కష్టాలను చూసా అని, పిల్లలను చదివించలేని తల్లి తండ్రులను చూసా అని జగన్ పేర్కొన్నారు. రైతులకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటా అని జగన్ పేర్కొన్నారు. 

 

పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నాను చూసాను అని జగన్ పేర్కొన్నారు. అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని భావించా అని జగన్ పేర్కొన్నారు. గుడి దగ్గర బడి దగ్గర మద్యం అమ్మడం చూసా అని జగన్ వ్యాఖ్యానించారు. కేవలం రెండు పేజీలలోనే మేనిఫెస్టో పెట్టామని అన్నారు. దానిని బైబిల్, ఖురాన్, గీత గా భావించామని అన్నారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: