ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను అధికారంలోకి వచ్చిన ఏడాది లో 90 శాతం హామీలను అమలు చేసామని సిఎం జగన్ అన్నారు. 129 హామీల్లో 77 హామీలను నేరవేర్చామని త్వరలో 16 హామీలు పరుగులు పెట్టడానికి సిద్దంగా ఉన్నాయని మరో 36 హామీలను అమలు చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు. మేనిఫెస్టో లో లేని 40 హామీలను కూడా అమలు చేసామని ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు. 

 

40,627 కోట్లను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజల ఖాతాల్లోకి జమ చేసామని జగన్ చెప్పుకొచ్చారు. వాహన మిత్ర,, నేతన్న నేస్తం వంటి కార్యక్రమాలను మొదలు పెట్టామని అందరికి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తామని సిఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఇచ్చిన హామీలను అన్నీ అమలు చేస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: