తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా ఒక రకంగా ఫన్నీగా ఉన్నా.. అందులో కొంత సెటైర్, కాంట్రవర్సీ ఉంటుంది.  ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహహ్మారితోనే తట్టుకోలేక పోతుంటే.. ఓ వైపు ఉగ్రదాడులు, తుఫాన్ దాడుల తర్వాత మిడతల దాడి ఒకటి మొదలైంది. వైరస్‌లు ప్రపంచంపై దాడి చేసిన అనంతరం ప్రస్తుతం మిడతలు అటాక్‌ చేస్తున్నాయని, తదుపరి ఏలియన్స్‌ దాడులు చేస్తాయా? అని సినీ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు మనిషికి అంతు చిక్కని సమస్య ఎలియన్స్. ఈ ఏలియన్స్ పై ఇప్పటికీ ఎన్నో చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

 

ఏలియన్స్ మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటాయని.. మానవజాతిని మొత్తం సమూలంగా నాశనం చేస్తాయని రక రకాలుగా చిత్రాలు వచ్చాయి.  మనిషి ఇప్పటికీ ఎలియన్స్ ఉన్నాయనే నమ్ముతున్నారు. కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచంలో ఆందోళనకరన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా మిడతలు కూడా పంట పొలాలను నాశనం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రామ్‌ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు. 'ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి' అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే మిడతల వల్ల పంట నష్టం ఘోరంగా వాటిల్లుతుంది.. దాంతో భవిష్యత్ లో ఆహార ధాన్యాలకు కొరత ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: