దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చుతోంది. భారత్ లో శనివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 1,73,763కు చేరింది. అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే తొమ్మిదవ స్థానానికి చేరుకుంది. కేసుల వారీగా పరిశీలిస్తే అమెరికాలో అత్యధికంగా 17,47,087 కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య లక్ష దాటింది. అమెరికా తరువాత స్థానాల్లో బ్రెజిల్, రష్యా ఉన్నాయి. బ్రెజిల్ లో 4,65,166 కేసులు నమోదు కాగా రష్యాలో 3,87,623 కేసులు నమోదయ్యయి. 
 
బ్రిటన్ లో 2,72,607 స్పెయిన్ లో 2,38,564 ఇటలీలో 2,32,248 మంది కరోనా భారీన పడ్డారు. 7,8,9 స్థానాల్లో ఫ్రాన్స్, జర్మనీ, భారత్ ఉన్నాయి. ఫ్రాన్స్ లో 1,86,924 జర్మనీలో 1,82,922 భారత్ లో 1,73,763 కేసులు నమోదయ్యాయి. టర్కీ పదవ స్థానంలో ఉండగా అక్కడ 1,62,120 కేసులు నమోదయ్యాయి. మొదటి కరోనా కేసు నమోదైన చైనా 14 వ స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో దేశంలో 7 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: