IHG

కరోనా వైరస్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కుదిపేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసింది. ఈ లాక్ డౌన్ కారణంగా భారీ , చిన్నతరహా పరిశ్రమలు చాలా నష్టపోయాయి. పరిశ్రమలే కాకుండా క్రీడా రంగం కూడా కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలు అయ్యింది. లాక్ డౌన్ లో కాలంలో నడవాల్సిన టోర్నీలు ఆగిపోయాయి. కరోనా కారణంగా ఇంటర్నేషనల్  వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రొఫెషనల్ క్రికెట్ నిలిపివేయబడింది. క్రికెట్ బోర్డులు అన్నీకూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్ట బడ్డాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆటగాళ్లకు మరియు సిబ్బందికి జీతాలను ఇవ్వలేమని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

 

 

సిబ్బంది, ఆటగాళ్ళు, అంపైర్లు మరియు కోచ్‌ల కోసం 50% జీతం లో కోత విధిస్తున్నట్లు సిడబ్ల్యుఐ తెలిపింది. వచ్చే ఆరు నెలల పాటు జీతాలతో కొత్త విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నిబంధనను జూలై 1 నుండి సాధ్యమైనంతవరకు అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది.  అయితే ఈ సందర్భంగా  సిడబ్ల్యుఐ  తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే బోర్డు లో ఉద్యోగస్తులకు మరియు కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కనీస స్థాయి రక్షణ కలిపిస్తున్నట్లు   సిడబ్ల్యుఐ తెలిపింది 

 

మరింత సమాచారం తెలుసుకోండి: