కర్ణాటక బీజేపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, విపక్షాలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో రాష్ట్రంలో పాలన ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అధికార పార్టీ బీజేపీలో సంక్షోభం మరింత ముదిరి పాకాన పడింది. ప్రస్తుతం రాష్ట్రంలోని బీజేపీలో ముసలం పుట్టినట్లు కనబడుతోంది. బీజేపీ సీనియర్ నేత ఉమేశ్‌ కత్తి తనను కేబినెట్ లోకి తీసుకోననందుకు ప్రభుత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన యడ్యూరప్పకు భారీ షాక్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. 
 
బీజేపీ సీనియర్‌ నేత ఉమేశ్‌ కత్తి తాజాగా కొందరు ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేయడం.... గత రెండు వారాల్లో రెండోసారి విందు భేటీ జరగడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెళగావి జిల్లాకు చెందిన ఉమేశ్‌ కత్తి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. పార్టీలో సీనియర్ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అయినా బీజేపీలోకి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి తనకివ్వనందుకు ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. యడ్యూరప్పకు వ్యతిరేకంగా చర్చ జరగలేదని.. పార్టీని కూల్చే ఉద్దేశం తనకు లేదని ఉమేశ్ కత్తి చెబుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: