తన బిడ్డలకు కష్టం వస్తే ఏ తల్లి అయినా సరే వేగంగా స్పందించి తన బిడ్డలను కాపాడుకుంటూ ఉంటుంది. ప్రపంచ౦లో ఎక్కడ అయినా సరే ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రాణాలకు తెగించి తన బిడ్డను కాపాడుకోవడానికి ఏ తల్లి అయినా సరే కష్టపడుతుంది. ఒక ఎలుక తన బిడ్డను కాపాడటం కోసం గానూ ప్రాణాలకు తెగించి పోరాడింది. ఒక ఎలుక రోడ్డు పక్కన తన పిల్లతో కలిసి ఒక పొదలో ఉండగా వాటిని చూసిన పాము వెంటనే అక్కడికి వెళ్ళింది. 

 

దానిని మింగడానికి గానూ పాము రాగా పాముపై ఎలుక దాడి చేసింది. దీనితో తట్టుకోలేని పాము అక్కడి నుంచి పారిపోయింది. నోట్లో ఉన్న పిల్ల ఎలుకను వదిలేసి పొదల్లోకి వెళ్ళిపోయింది పాము ఈ వీడియో ని అటవీ శాఖ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: