గత రెండు వారాలుగా తెలంగాణకు చుక్కలు చూపిస్తున్న పులి ఆచూకి ఇప్పుడు లభ్యమైంది. గగన్ పహాడ్ అడవుల్లోనే అది తిరుగుతుంది అని అధికారులు చెప్తున్నారు. ట్రాప్ కెమెరాలను అధికారులు 20 ఏర్పాటు చేయగా వాటిలో దాని ఆచూకి కనపడింది. అది అక్కడ ఉన్న చెరువుల వద్ద నీళ్ళు తాగుతూ కనపడింది. 

 

దీనితో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఒకరే  బయటకు వెళ్ళవద్దు అని ఎక్కడ అయినా పులి జాడలు కనపడినా చెప్పాలి అని అధికారులు సూచనలు చేసారు. దీనితో ఆ పరిసర గ్రామాల ప్రజలు అది ఎక్కడ వచ్చి తమ మీద దాడి చేస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: