కేంద్రం లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తూ ప్రకటన చేసింది. గతంలో రెండు, మూడు వారాలు మాత్రమే లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం ప్రస్తుతం లాక్ డౌన్ ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన చేసింది. కేంద్రం జులై నుంచి స్కూళ్లు, కాలేజీలకు కేంద్రం అనుమతులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8వ తేదీ నుంచి వీటిని తెరవవచ్చని చెబుతోంది. 
 
జూన్ 8వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రారంభం కానుందని తెలుస్తోంది. రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాలను సంప్రదించి కేంద్రం స్కూళ్లు, కాలేజీల విషయంలో నిర్ణయం తీసుకోనుంది. కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ నిబంధనలు పరిమితం చేసింది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: