ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిందని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర జిల్లా అధికారులకు ఒక సర్క్యులర్ జారీ చేశారని.... రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా ప్రకటించుకున్నారని అన్నారు. విజయవాడ కార్యాలయం నుంచి సర్కులర్ విడుదల చేసి హైదరాబాద్ లోని తన ఇంటికి వాహనాలను పంపాలని చెప్పారని తెలిపారు. 
 
ఎన్నికల కమిషనర్ గా కొనసాగాలని హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ మాత్రం తనంతట తానుగా సర్క్యులర్ ఇచ్చారని... ఇప్పటికే తాము సుప్రీంకు వెళతామని పిటిషన్ ను దాఖలు చేశామని అన్నారు. శ్రీరామ్ వ్యాఖ్యలతో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగనున్నారో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: